టాలీవుడ్ స్టార్ హీరోస్ .. ఎప్పటికప్పుడు తమ అభిమానులతో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాను విరివిగా వాడుతుంటారు.  తమ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తమ వ్యక్తిగత విషయాలను సైతం స్టార్స్ పంచుకుంటుండటంతో వారిని అనేక మంది ఫాలో అవుతుంటారు.ఈ క్రమంలోనే ఒక్కో స్టార్‌కు ఒక్కో రేంజ్‌లో ఫాలోవర్స్ ఉంటారు.

కాగా స్టార్ హీరోల ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో ఫాలోవర్స్‌ను సంపాధించుకుని మన స్టార్స్ సోషల్ మీడియాలోనూ పలు రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా దగ్గుబాటి రానా  తన ట్విట్టర్ అకౌంట్‌లో ఏకంగా 6 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాధించుకుని అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. నిన్నటికి నిన్న బాబాయ్ విక్టరీ వెంకటేశ్ .. ఇన్ స్టా గ్రామ్ లో 1మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని రికార్డు క్రియేట్ చేస్తే.. ఇప్పుడు అబ్బాయ్ రానా.. ట్విట్టర్ లో 6మిలియన్స్ ఫాలోవర్స్ ను తెచ్చుకోవడం విశేషంగా మారింది.

Leave a comment

error: Content is protected !!