ముస్లిం సోదరసోదరీమణులకు ఎంతో పవిత్ర మాసం రంజాన్. రోజా పాటిస్తూ హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ రుచులను ఆస్వాదిస్తూ ప్రేమను శాంతిని బోధించే పవిత్ర మాసం ఈ రంజాన్. హైదరాబాద్ నగర వాసులకు మరింత వేడుకను తెచ్చిపెట్టడానికి దావత్ -ఏ- రంజాన్ అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ అబండెన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ప్రారంభించారు ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్.. సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తనయుడు మహ్మద్ అసదుద్దీన్‌లు ఈ అబండెన్స్ నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పోను కరిష్మాకపూర్ ప్రారంభించడం మరింత విశేషం.
మెహిదీ పట్నంలోని కింగ్ ప్యాలెస్‌లో దావత్ ఏ రంజాన్ ఈవెంట్ గ్రాండ్‌గా ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 21 , 2023 వరకు 14 రోజుల పాటు సాగనుంది. గ్రాండ్ నైట్ బజార్ ప్రధాన ఆకర్షణ. ఇందులో చిన్నా పెద్ద వయోభేదం లేకుండా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఫ్యాషన్ దుస్తులు, రంజాన్‌కు అవసరమయ్యే వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేసారు.
హైదరాబాద్ బిర్యాని, హలీమ్ రుచులను ఇష్టంగా ఆస్వాదిస్తానని, రంజాన్ ఏ దావత్ ఎక్స్‌పో ను ప్రారంభించడం చాలా సంతోషంగా వుందని కరిష్మాకపూర్ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఓల్డ్ సిటీ కి చేరువలో ఈ అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో ను నిర్వహించడ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అబండెన్స్ రీజనల్ హెడ్ మిస్టర్ జాకీ జియావుద్దీన్ ఆలీ. రంజాన్- ఏ- దావత్, అబండెన్స్ భాగస్వామ్యం ఈ రంజాన్ ఎక్స్‌పో తో మరింత బలపడనుందని తెలిపారు. అట్రియా గ్రూప్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు, రంజాన్ – ఏ – దావత్‌కు సహకార భాగస్వామిగా ఉన్న అబండెన్స్ సంస్థ అతిపెద్ద విజయం సాధించబోతుందని, సదాశివపేటకు సమీపంలో 4 వేలకు పైగా విల్లాల ప్రాజెక్ట్‌ను నిర్వహించబోతుందని రీజనల్ హెడ్ జియావుద్దీన్ అలీ తెలిపారు. మే 2023 లో ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు.
14 రోజుల పాటు గ్రాండ్ గా సాగే రంజాన్ ఏ దావత్ ఎక్స్‌పో ప్రదర్శనలో గాజుల మెరుపులు, హలీమ్ సువాసన, ఇరానీ చాయ్ రుచి మరియు మెహందీ యొక్క మెరుపును ప్రతిధ్వనిస్తుందన్నారు.