చిత్రం : ది వారియర్
నటి నటులు: రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, నదియా, బ్రహ్మాజీ, జయప్రకాష్, దివ్య శ్రీపాద, మాస్టర్ రాఘవన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సుజిత్ వాసుదేవ్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
రచన, దర్శకత్వం: ఎన్. లింగుసామి
రీలిజ్ డేట్: జులై 14.2022
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా, అందాల భామ కృతి శెట్టి హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా, ప్రముఖ తమిళ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో ఒకే రోజు విడుదల అవ్వడం విశేషం. ఈ మూవీ నుంచి విడుదలైన బుల్లెట్, విజిల్ సాంగ్స్ మంచి ఆధరణ లభించింది. పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించిందా లేదా మనం మూవీ రివ్యూలో చూద్దాం..
కథ: సత్య(రామ్ పోతినేని) ఎంబీబీఎస్ పూర్తి చేసి వృత్తి పరంగా అమ్మ(నదియా)తో కలిసి కర్నూలుకు వస్తాడు. సత్య(రామ్ పోతినేని) ఒక హాస్పటల్ లో డాక్టర్ గా పనిచేస్తుండగా, ఆర్జే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) తో లవ్ లో పడతాడు. ఆ సిటీ లో గురు (ఆది పినిశెట్టి) ఆధిపత్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గురు మనుషులు ఒకరి మీద హత్యా ప్రయత్నం చేయగా, ప్రాణాపాయ స్థితిలో ఉంటే సత్య ఆసుపత్రి లో ట్రీట్మెంట్ చేసి కాపాడతాడు. గురు అనుచరులు ఆసుపత్రికి వచ్చి చంపడంతో, సత్య(రామ్ పోతినేని) గురు పై పోలీసులకి కంప్లైంట్ చేస్తాడు. అది తెలుసుకున్న గురు(ఆది పినిశెట్టి) కర్నూల్ నడి బొడ్డున సత్యను చంచేలా కొడతాడు. కొంత సమయం తరువాత సత్య మాయమవ్వుతాడు. రెండేళ్ల తర్వాత అదే కర్నూల్ కి వచ్చి, తనపై ఎటాక్ చేసిన గురుపై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది సినిమా.
కధనం,విశ్లేషణ: పోలీస్ తరహా కధలు ఎన్ని వచ్చిన ప్రేక్షలు ఎంతగానో ఆదరిస్తుంటారు. కానీ, ఒక డాక్టర్ పోలీస్‌గా మారడం. మారి రౌడీయిజాన్ని అంత మొందించడం అనే కొత్త ప్లాట్ తో ‘ది వారియర్’ను తెరకెక్కించారు దర్శకుడు లింగుస్వామి. పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది.
ఫస్టాఫ్ చాలా కూల్ గా ఎంటర్టైనింగా స్టార్ట్ అవ్వుతుంది. రామ్, కృతి ల పెయిర్ స్క్రీన్ మీద చుడముచ్చట గా ఉంటుంది. వీల్లద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ నార్మల్ గా అనిపించినా, హీరో విలన్ మధ్య సాగే ఫేస్ టు ఫేస్ సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. గురు విలనిజాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎలా ఉంటుందనేది ప్రేక్షకులు ఊహించిన, రామ్ పోతినేని విలన్స్ ని ఉరికెత్తేంచే సీన్స్ వావ్ అనిపిస్తాయి. ఎస్పెషియల్లి హీరోయిన్ మిస్ అయ్యిన సీన్, ఎద్దు తో పోట్లాడే సీన్ అద్భుతంగా ఉంటాయి. కానీ, స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉండేలా చూసుకుంటే ఇంకా బావుండేది. పైగా సినిమాలో ఆ స్థాయిలో డైలాగ్స్ లేకపోవడం, కొన్ని సీన్స్ బోర్ అనిపించినప్పటికీ బీజీఎం, సాంగ్స్ తో నిలబెడతాయి. బుల్లెట్, విజిల్ సాంగ్స్ లో రామ్ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులకి కిక్ ఇస్తుంది.
రామ్ పోలీస్ డ్రెస్ లో కనపడటం సినిమాకి ఒక ఎస్సెట్ అలాగే, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఓకే. ‘జననం’ అంటూ వచ్చే నేపథ్య గీతం సినిమాకే హైలైట్. ప్రాణం విలువ తెలియని వ్యక్తులకి ఆ విలువ తెలిసేలా చేయాలనీ డాక్టర్ పోలీస్ కావడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులని అబ్బురపరుస్తుంది. కాకపోతే ఇంకా బాగా డీల్ చేసి ఉండాల్సింది.
నటి నటుల పెర్ఫామెన్స్: ఉస్తాద్ రామ్ పోతినేని ఎప్పటి లాగే స్క్రీన్ మీద ఒక డాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా 100% ఎనర్జిటిక్ తో అదరకొట్టాడు. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆడియెన్స్ కి భయం పుట్టేలా తన యాక్టింగ్ తో భళా అనిపించుకున్నాడు. ఆది పినిశెట్టి కి భార్య గా నటించిన అక్షర గౌడ చేసిన చిన్న పాత్ర అయ్యిన సూపర్బ్ అని చెప్పాలి. బ్రహ్మాజీ పోలీస్ ఆఫీసర్ రోల్ లో యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది. తల్లి పాత్రలో నటించిన నదియా అలాగే శరణ్య ప్రదీప్, దివ్య శ్రీపాద, అజయ్, భారతి రాజా తదితరులు వాళ్ళ యాక్టింగ్ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక వర్గం: డైరెక్టర్ ఎన్. లింగుసామి హీరో ని పవర్ ఫుల్ గా చూపించడం లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కధ తీసిన విధానం బాగున్నా, బలమైన సన్నివేశాలు కొత్తగా రాసుకొని ఉంటే బాగుండేది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్ కోసం తీసిన ఈ సినిమా ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది. డిఎస్పి అద్భుతమైన మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోసాడు. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ విజువల్స్ పరంగా సూపర్బ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు.
రేటింగ్: 3/5
Review – Tirumalasetty Venkatesh