‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెడ్’ . ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ తన కెరీర్ లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రామ్.  కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తమిళ చిత్రం ‘తడం’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఆ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేసింది. ఒకే పోలిక తో ఉన్న ఇద్దరు  ఒక మర్డర్ కేస్ లో ఇరుక్కుంటే.. జరిగే ఉత్కంఠ భరిత పరిణామాల సమాహారమే  ‘రెడ్’. ఏప్రిల్ 9 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను అప్పుడే మొదలు పెట్టేశారు  మేకర్స్. అందులో భాగంగా ముందుగా ఈ సినిమా టీజర్ ను ఈ సాయంత్రం విడుదల చేశారు.

ఆదిత్య, సిద్ధార్ధ అనే ఇద్దరు వేరు వేరు మనస్తత్వాల గల వ్యక్తులు ఒకేపోలిక తో ఉండడం వల్ల ఒక మర్డర్ కేస్ నీరుగారిపోతుంది.  చివరికి అది ఎలా సాల్వ్ అవుతుంది? అది చేసింది ఎవరు? ఆ మర్డర్ చేయడానికి వెనుక హంతకుడి మోటో ఏమిటి? అనే అంశాలకు సంబంధించిన షాట్స్ ఈ టీజర్ లో  కనిపిస్తాయి. రామ్  రెండు పాత్రల్లోని వేరియేషన్స్ అద్భుతంగా పలికించాడు. ఆదిత్య, సిద్ధార్ధ ఇద్దరూ ఒకరికి ఒకరు సంబంధం లేదని టీజర్ లో రివీల్ చేశారు. కావాలనే నన్ను ఈ మర్డర్ లో ఇరికిస్తున్నారని రామ్ పలకడాన్ని బట్టి.. ఆ మర్డర్ వెనుక ఎవరిదో పెద్ద హస్తమే ఉందనిపిస్తుంది. మొత్తం మీద రెడ్  చిత్రం రామ్ నుంచి రానున్న మరో ఇస్మార్ట్ ట్రీట్ అనిపిస్తోంది.

టీజర్ ను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=n1gkahx6Xlg&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!