Ramoji Rao :  మీడియా మొఘల్ రామోజీరావు .. 50 ఏళ్ళ తన మీడియా ప్రస్థానాన్ని వదిలిపెట్టి.. తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. ఈనాడు దినపత్రిక, ఈటీవీ, మార్గధర్శి, కళాంజలి, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, ఉషాకిరణ్ మూవీస్ లాంటి పలు శాఖలకు తనే తిరుగులేని శక్తిగా చాటిచెప్పిన ఆయనకు సినిమాలంటే.. చాలా ఇష్టం. అంతేకాదు ఒక సినిమాలో అతిథిపాత్ర కూడా పోషించారు ఆయన. 1978 లో యు. విశ్వేశ్వరరావు నిర్మించిన ‘మార్పు’ చిత్రంలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. నటించింది అతిథి పాత్రలోనే అయినా సినిమా పోస్టర్లపై రామోజీరావు బొమ్మ ప్రచురించారు.

Leave a comment

error: Content is protected !!