RC 16 : తెలుగు సినీ ప్రేమికులందరికీ అత్యంత ఆసక్తికరమైన వార్త ఏంటంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు కలిసి చేస్తున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ నెలాఖరు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
మైసూర్‌లోని అద్భుతమైన లొకేషన్లలో తొలి షెడ్యూల్ జరుగుతుంది. అంతేకాకుండా, హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న భారీ సెట్‌లో కూడా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన స్పోర్ట్స్ పర్సన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలోని మెజారిటీ భాగం ఈ భారీ సెట్‌లోనే చిత్రీకరించనున్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జంటగా నటిస్తున్నారు. ఆమె మొదటి షెడ్యూల్‌లో చేరతారా లేదా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్ అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు పాటలను కంపోజ్ చేశారు. రెహ్మాన్ మ్యూజిక్‌తో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్లే.