Gamechanger : రామ్ చరణ్ తన కెరీర్ లోనే మొదటిసారిగా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా “గేమ్ ఛేంజర్”. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రకు “అప్పన్న” అని పేరు. ఈ పాత్రలో చరణ్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. “రంగస్థలం” చిత్రంలో చెవుడు చవిటి పాత్ర పోషించిన చరణ్, ఈ చిత్రంలో “నత్తి”తో కూడిన పాత్రలో నటించనున్నాడు.

కొడుకు పాత్రలో చరణ్ ఐఏఎస్ అధికారి రామ్ చందన్ గా నటించనున్నారు. అప్పన్న- రామ్ చందన్ పాత్రల మధ్య చాలా వైవిధ్యం ఉండనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ రెండు పాత్రల్లోనూ చరణ్ చాలా బాగా నటించారని వారు చెబుతున్నారు. “అప్పన్న” ఆశయాలను నెరవేర్చడానికి తనయుడు రామ్ చందన్ ఏం చేశాడు? తండ్రికి జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం.

ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట విడుదలై మంచి స్పందన పొందింది. మరో పాట త్వరలోనే విడుదల కానుంది. “ఇండియన్ 2” విడుదలైన తర్వాత “గేమ్ ఛేంజర్” ప్రచారం మరింత ముమ్మరంగా జరగనుంది.

Leave a comment

error: Content is protected !!