దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌‌లతో అంచనాలు పెంచేశారు. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
మా చిత్రానికి సపోర్ట్‌గా నిలిచిన వివేక్ కూచిభొట్ల గారికి, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. నిర్మాత దీపికాంజలికి థాంక్స్. సినిమాలో నటించిన, పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ధారన్ సుక్రి మంచి కెమెరామెన్‌గా ఇండస్ట్రీలో ఎదుగుతారు. రాజ్ కుమార్ మాస్టర్ ఫైట్స్ బాగుంటాయి. దేశ భక్తిని చాటి చెప్పే చిత్రమే కానీ.. బార్డర్‌లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు అన్నారు దర్శకుడు మిహిరాం.
మాకు ఇది మొదటి సినిమా. మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారన్నారు నిర్మాత దీపికాంజలి.
సాయి కుమార్ గారితో నటించడంతో లైఫ్ సర్కిల్ కంప్లీట్ అయినట్టుగా అనిపించింది. సూర్య, దీపికలు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు. దర్శకుడు చాలా పెద్ద స్థాయికి వెళ్తారన్నారు ధన్య బాలకృష్ణ
చాలా రోజుల తరువాత దేశ భక్తిని చాటే చిత్రంలో నటించాను. మొదటి సినిమాతోనే ఇలాంటి జానర్‌ను ఎంచుకుని సూర్య చాలా కష్టపడ్డాడు. హీరో సూర్య, దర్శకుడు మిహిరామ్ ఇద్దరూ కృష్ణార్జునలుగా కలిసి ఎంతో కష్టపడి సినిమాను తీశారంటూ మెచ్చుకున్నారు సాయికుమార్.
మా అమ్మానాన్నలు ఎవరో ప్రేక్షకులకు తెలియదు. ఒక హిట్ ఇస్తే ఇండస్ట్రీ అంతా తిరిగి చూస్తుంది. అందుకే ఈ సినిమాను తీశాం. ఈ చిత్రానికి నలుగురు పిల్లర్స్‌గా నిలిచారు. నేను, డైరెక్టర్, కెమెరామెన్ ధారన్ సుక్రి, నా ఫ్రెండ్స్. నా స్నేహితులందరూ కలిసి ఫండింగ్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రం పెద్ద చిత్రం అనేది ఉండదు. మొన్నే పెద్ద చిత్రాల మధ్యలో చిన్న సినిమా వచ్చి నిలబడింది. ఇప్పుడు కూడా పెద్ద చిత్రాల నడుమ చిన్న చిత్రం రాబోతోంది. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. ఇక మున్ముందు రామ్ పేరు వినిపిస్తూనే ఉంటుందన్నారు హీరో సూర్య.

Leave a comment

error: Content is protected !!