మెగాస్టార్ చిరంజీవితో  ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు స్టైలిష్ డైరెక్టర్ సురేంద్రరెడ్డి. ఈ సినిమా తర్వాత అతడి తదుపరి చిత్రంపై టాలీవుడ్ లో ఆసక్తి మొదలైంది. అల్లు అర్జున్ తో మరోసారి సినిమా తెరకెక్కిస్తాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే బన్నీ ‘పుష్ప’ చిత్రంతో ఫుల్ బిజీగా ఉండడంతో .. సూరి దృష్టి మరో యంగ్ హీరోపై పడిందనే వార్తలొస్తున్నాయి.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో సురేంద్ర రెడ్డి తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇటీవలే సురేందర్ రెడ్డి ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు లైన్ వినిపించారట. లైన్  బాగా నచ్చడంతో సురేందర్ రెడ్డి తో కలిసి వర్క్ చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి.  ప్రస్తుతం రామ్ ‘రెడ్’ (తమిళ ‘తడం’ రీమేక్ ) చిత్రంలో నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. థియేటర్స్ రీ ఓపెన్ అయిన తరువాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!