సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టకపోయినా, తన సహాయక స్వభావం, ఆలోచనలు, ప్రణాళికలతో చాలా మంది హీరోలను రానా నేరుగా, పరోక్షంగా ఇన్స్పైర్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రామ్ పోతినేని లో కూడా కదలిక కలిగించారు ఈ హీరో. ఇప్పటివరకు సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న రామ్ కు వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనను పుట్టించారు. రానా నాయుడు లాగా ఒక సిరీస్ చేయాలని తన సన్నిహితులతో ఓపెన్ అయ్యారట రామ్. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నానని కూడా అన్నారట. ఈ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
రానా నాయుడు సిరీస్ ఘన విజయం సాధించడంతో రామ్ పోతినేని కూడా వెబ్ సిరీస్‌లోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలే వెబ్ సిరీస్ బాట పడుతుండడం తో యంగ్ హీరోలు కూడా ఆ దిశ గా ఆలోచింస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!