ప్రపంచ దేశాలన్నీ కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయి. దాని పుట్టిల్లు చైనాలో రచ్చచేసి .. ఇప్పుడు ఇటలీలో మారణహోమం సాగిస్తోంది. అలాగే.. అమెరికాకు కూడా దారుణమైన రీతిలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. భారత్ లో కూడా అలా జరగకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ను విధించింది. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ పూర్తి కానున్నది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు, దీపాలు, టార్చిలైట్లు వెలిగించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్పందించారు. “లాక్ డౌన్ నిర్ణయాన్ని గౌరవించి పాటిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల గర్విస్తున్నాను. వారందరిపైనా నా ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇప్పుడదే స్ఫూర్తితో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించి మరింత చైతన్యాన్ని పెంచుదాం… మర్చిపోవద్దు” అంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు.
I am proud of everyone who has faithfully been abiding by the lockdown! My love to you all.
With the same spirit, let's light up lamps and come together to spread awareness for 9 minutes at 9 pm this Sunday. Don’t forget! 🙏🤗@NarendraModi #LightForIndia #IndiaFightsCorona pic.twitter.com/p28rAwG8MP
— Ram Charan (@AlwaysRamCharan) April 4, 2020