గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. 2025 వేసవిలో సింగపూర్‌లోని ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం అందుబాటులోకి రానుంది. అబుదాబిలో జరిగిన IIFA అవార్డ్స్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా చరణ్ “మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు”ని అందుకున్నారు.
సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్టాత్మకమైన సూపర్‌స్టార్ల లైనప్‌లో చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. చిన్నప్పుడు, దిగ్గజ నటుల జీవితకాలపు వ్యక్తులను చూసి నేను ఆశ్చర్యపోయే వాడిని. ఏదో ఒక రోజు వారి మధ్య నేను కూడా ఉంటానని కలలో కూడా అనుకోలేదు. ఇది అద్భుతమైన అవకాశం. మేడమ్ టుస్సాడ్స్ ఇస్తున్న ఈ గుర్తింపు నా క్రాఫ్ట్ పట్ల కృతజ్ఞతతో ఉన్నాను అని అన్నారు.
రామ్ చరణ్ కటౌట్ కి ఒక ప్రత్యేకమైన టచ్ జోడిస్తూ, రామ్ చరణ్ ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ కూడా ఈ మైనపు బొమ్మలో కలిసి ఉందనుడటం విశేషం. దీంతో క్వీన్ ఎలిజబెత్ II కాకుండా, వారితో పాటు ఒక పెంపుడు జంతువుతో కూడిన మైనపు బొమ్మ కలిగిన ఏకైక సెలబ్రిటీగా చెర్రీ నిలవబోతున్నారు. ఈ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌లో రైమ్ నాతో చేరడం ఎంతో సంతోసహాయంగా ఉంది. రైమ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, నా వ్యక్తిగత జీవితంతో ఎంతో ముడిపడి ఉన్న అంశజం అని రామ్ చరణ్ పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన IIFA, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ వేదికపై భారతీయ సినిమా వేడుకలను ఒకచోట చేర్చి, అభిమానులను తమ అభిమాన తారలతో ప్రత్యేకమైన రీతిలో నిమగ్నమయ్యేలా కొనసాగిస్తోంది.

Leave a comment

error: Content is protected !!