పొలిటికల్ చదరంగాన్ని బాగా ఆడేవాడే.. చట్టసభల్లో అడుగుపెడతాడు. చట్ట సభల్లో అడుగుపెట్టిన ప్రతీ వాడూ గొప్పవాడని చెప్పలేం.. క్రిమినల్ పాలిటిక్స్ భరతం పట్టాలంటే అదే పొలిటికల్ చదరంగాన్ని మంచి కోసం ఆడాలి. అలాంటి వాడే గేమ్ ఛేంజర్ అవుతాడు. పొలిటికల్ హీట్ పెరిగిన ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నాడు రామ్‌చరణ్.
ఓవైపు మెగా వారసుడు రామ్ చరణ్ .. మరోవైపు సెన్సేషనల్ హిట్స్‌కి వారసుడు డైరెక్టర్ శంకర్.. వీళ్లిద్దరినీ కలిపినవాడు వారసుడుతో తమిళ్ ఎంట్రీ ఇచ్చిన ప్రొడ్యూసర్ దిల్‌రాజు. వీరి కాంబినేషన్‌లో RC 15 అనౌన్స్ చేసినప్పుడే హై బజ్ వచ్చేసింది. ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారా అనే ఉత్కంఠకు రామ్‌చరణ్ పుట్టినరోజు (మార్చి 27) న తెరదించారు.
మెగా వారసుడు కాస్తా మెగా పవర్‌స్టార్ గా స్టార్‌డమ్ అందుకుని ఇప్పుడు ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్‌స్టార్ అయ్యాడు. రీసెంట్‌గా ఆస్కార్ విన్నింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ టీమ్‌కి విపరీతమైన ఖ్యాతి దక్కింది. అందులో గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ కి కాస్త ఎక్కువే గుర్తింపు దక్కింది. ఇప్పుడు శంకర్ డైరెక్షన్‌లో సినిమా అంటే అంచనాలకు హద్దు, అభిమానుల ఆనందానికి అవధులు రెండూ ఉండవు. పుట్టిన రోజు హంగామా ను డబుల్ చేస్తూ RC 15 టైటిల్ రిలీజ్ చేసింది దిల్ రాజు టీమ్.
శంకర్ డైరెక్షన్‌లో సినిమా డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెడతాడనే పేరుంది.. చెర్రీకున్న క్రేజ్ కు ఇప్పుడు ఎంత ఖర్చుపెట్టినా వర్కువుట్ అవుతుంది. గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ కాకుండా సామాజిక సమస్యల కోణాన్ని మరోసారి RC 15 తో శంకర్ తనదైన పాత స్టైల్లో కి వచ్చేసాడు. జెంటిల్‌మేన్ లో విద్యావ్యవస్థలో అవినీతిని, శివాజీలో కార్పొరేట్ వ్యవస్థ పొలిటికల్ వ్యవస్థను ఎలా శాసిస్తుంది అనేది చూపించిన శంకర్ ఈసారి పొలిటికల్ కరప్షన్ ను చెర్రీ ఇమేజ్‌కు తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చూపించబోతున్నాడు. RC 15 కు టైటిల్ రిలీజ్ చేసారు. గేమ్‌ఛేంజర్ అనే టైటిల్ అనౌన్స్ చేసారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్‌ను మార్చే గేమ్ ఛేంజర్‌గా రామ్ చరణ్ విశ్వరూపం చూపించబోతున్నాడనే విధంగా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.