టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే అత్యధిక క్రేజ్ తెచ్చుకుంది అందాల రకుల్ ప్రత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం తో అమ్మడి విజయాల ప్రయాణం ప్రారంభమైంది.  ఆ తర్వాత వరుసగా పండగచేస్కో, కిక్ 2, బ్రూస్లీ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, జయజానకీ నాయక, స్పైడర్ లాంటి చిత్రాలతో తన టాలెంట్ ను నిరూపించుకొనే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో అమ్మడికి కాస్తంత నిరాశ ఎదురైంది. అందుకే ఆ తర్వాత తన మకాన్ని బాలీవుడ్ కు షిఫ్ట్ చేసింది రకుల్ .

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తొలి చిత్రం దేదే ప్యార్ దే సూపర్ హిట్టవడంతో .. అక్కడ చిత్రాల్లో బిజీ కావాలనుకుంది. ఆ ప్రయత్నంలో అమ్మడు హద్దులు దాటి కూడా నటించింది. మరి దాని ఫలితమో ఏంటో గానీ.. రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడో బోల్డ్ పాత్ర పోషించే ఛాన్స్ దక్కింది. అది అలాంటి ఇలాంటి పాత్ర కాదు మరి. ముంబై.. రెడ్ లైట్ ఏరియాలోని ఒక ప్రముఖ  వేశ్య బయోపిక్. బోల్డ్ పాత్ర అయినా.. నటనకు ఎంతో ప్రాధాన్యం ఉండడం వల్ల రకుల్ ఈ పాత్రను చేయడానికి ఒప్పుకుందట. త్వరలోనే హిందీలో తెరకెక్కబోతున్న ఈ సినిమా రకుల్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!