Indian 2 : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబో లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ  “ఇండియన్ 2”. భారతీయుడు 2 పేరుతో తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా..  రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఆమె పాత్ర కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం కానుంది.  ఆమె సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తుంది.

నిజానికి రకుల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఇంకా బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 28 ఏళ్ళ క్రితం రిలీజై తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్టైన ఇండియన్ సినిమాకిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. జూన్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!