కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు బొమ్మలు గీసుకుంటున్నారు. కొందరు ఇష్టమైన సినిమాలు చూస్తున్నారు. మరికొందరు వంటలు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ అందాల రకుల్ ప్రీత్ మాత్రం రోగ నిరోధక శక్తిని పెంచుకోండంటూ.. ఆరోగ్యసూత్రాల్ని వల్లె వేస్తోంది.

 ‘‘అందరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఇలాంటి సమయాల్లో సహజంగా ఉండటమే చాలా ఉత్తమం. చిటికెడు అల్లం, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్కతో లవంగాలను 500 మిల్లీ లీటర్ల నీటిలో కలపండి. దాన్ని బాగా ఉడికించండి. ఆ తరువాత దాన్ని తాగండి. మీకు వీలైతే, కొంచెం తేనె కూడా జోడించి తాగండి. చాలా రుచిగా ఉంటుంది. మంచి శక్తిని కూడా ఇస్తుంది’’ అంటూ చెబుతోంది.

Leave a comment

error: Content is protected !!