తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రం నుంచి శృంగార గీతం “ధిర ధిరన” లిరికల్ వీడియో విడుదలైంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీతం. ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!