భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విలువైన అవార్డ్ గా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనని వరించడం పై సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తపరిచారు. ఈ మేరకు రజనీ ఓ ట్వీట్ చేశారు.
‘సినిమా రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రకాశ్ జావడేకర్, ఇతర జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ…
తనలోని నటుడ్ని గుర్తించి ఎంతగానో ప్రోత్సహించిన బస్సు డ్రైవర్, తన స్నేహితుడైన రాజ్ బహదూర్, పేదరికంలో ఉన్నప్పటికీ నన్ను నటుడ్ని చేయడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన పెద్దన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్, అలాగే ఈ రజనీకాంత్‌ను సృష్టించిన నా గురువు బాలచందర్‌తోపాటు.. తనకు జీవితాన్నిచ్చిన నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు, మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ఇప్పటి వరకూ తన ప్రయాణంలో తోడుగా సాగిన ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వన్, ప్రతిపక్ష పార్టీ నేత స్టాలిన్, కమల్ హాసన్‌తోపాటు ఇతర రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరికీ తన కృతజ్ఞతలు… జైహింద్… అని రజనీ ప్రకటించారు.