డిస్కవరీ ఛానల్ లో ప్రసారమయ్యే ఇన్ టు ది వైల్డ్ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. ఈ నెల 23న ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. డబ్బై ఏళ్ళ వయసులో కూడా రజనీ చేసే సాహసాలు చూపరులకు షాకిచ్చాయి. ముఖ్యంగా బేర్ గ్రిల్స్ రజనీ స్టాలాఫ్ బిహేవియర్ కు, ఆయన స్టైల్స్ కు ఫిదా అయ్యాడు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో లో బేర్ గ్రిల్స్ కు రజనీ కళ్ళజోడు స్టైల్ గా ఎలా పెట్టుకోవాలో వివరించి చూపించారు. దాన్ని ఆచరణలో పెట్టడానికి బేర్ గ్రిల్స్ చాలా ఇబ్బంది పడ్డాడు. రెండు మూడు సార్లు చేసి ఫెయిల్ అయిన బేర్ తో చివరికి రజినీయే చేయించి అతడికి ఆనందం కలిగించారు. దాంతో అందుకే నువ్వు ఫిల్మ్ స్టార్ వి అయ్యావని రజనీని పొగిడేశాడు బేర్ గ్రిల్స్ ..  ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 

Leave a comment

error: Content is protected !!