ఈనెల 26వ తేదీ నటకిరిటీ, డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి ఇంట్లో “రక్త కన్నీరు నాగభూషణం” గారి పుస్తకావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి ఆ పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ గారు నన్ను ఆహ్వానించారు. నేను కూడా వెళ్లాను. అంతకుముందు ఫయాజ్ గారు రాసిన “నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి” పుస్తకాన్ని నేను పబ్లిష్ చేశాను. ఆ ప్రేమతో ఆయన నన్ను కూడా కార్యక్రమానికి ఆహ్వానించారు. నేను సినిమా జర్నలిస్టుగా ఇంతవరకు చాలామంది సినిమా వాళ్ళతో కలిశాను. అంత హాయిగా గడిపిన సందర్భం లేదు. “ఆహనా పెళ్ళంట” సినిమా చూసి ఎంతగా ఎంజాయ్ చేస్తామో, ఆయన సమక్షంలో రెండు గంటలు అలా గడిచాయి. సినిమాలో అంటే టేకులు అన్నీ ఉంటాయి. ఇది అలా కాదు. ఇది లైవ్. అందులో ఆయన స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్. అప్పటి రమణారెడ్డి గారు, నాగభూషణం గారు గారు ఎలా మాట్లాడే వారో చేసి చూపించారు. వారు ఎలా మాట్లాడుతారో కళ్ళకు కట్టినట్టు హావ భావాలతో చూపించి కడుపుబ్బ నవ్వించారు. అవన్నీ చూస్తే పొట్ట చెక్కలు అయింది. హాయిగా మనసు నిండా నవ్వుకున్నాము. అంత బిజీగా ఉండి ఆయన మాతో రెండు గంటలు నడపడం మరపురాని సన్నివేశం. ఈ సందర్భంగా నేను రచయిత ఫయాజ్ గారితో కలిసి “నువ్వుల మాంత్రికుడు రమణారెడ్డి” గారి పుస్తకాన్ని ఆయనకు బహుకరించాము. చాలా సంతోషించారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగాము. కొన్ని అనుకోకుండా గుర్తుండిపోతాయి. ఈ సందర్భంగా కూడా అలాంటిదే. ఈ అవకాశం నాకు రచయిత ఫయాజ్ గారు కల్పించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫయాజ్ గారు చక్కగా రచించిన “నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి” గారి పుస్తకం కావలసినవారు సంప్రదించగలరు. పుస్తకం ఖరీదు ₹250. రిజిస్టర్ పార్సిల్ కు 50 రూపాయలు. వెరసి 300 రూపాయలు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9640254786, జీలాన్ బాషా , సినీజర్నలిస్ట్, పబ్లిషర్.
