రోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ‘మనకోసం’ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. కరోనా విపత్తు కారణంగా కష్టాల్ని ఎదుర్కొంటున్న సామాన్యులకు సినీ తారలు అండగా నిలుస్తున్నారు. విరాళాలు, నిత్యవసర సరుకులు అందించడంతో పాటు వివిధ రూపాల్లో మేమున్నామంటూ ప్రజల్లో కొండంత ధైర్యాన్ని నింపుతున్నారు.
తాజాగా సినీనటుడు రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక తమ మంచి మనసును చాటుకుంటున్నారు. కరోనా విజృంభణ సమయంలో మరోసారి సాయం ప్రకటించారు. ఇటీవలే శివాని, శివాత్మికలు ఒక్కొక్కరు రూ.1లక్ష చొప్పున ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ కి విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఈ రోజు వారిద్దరు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 లక్షల సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు.
.@ActorRajasekhar's Daughters @Rshivani_1 @ShivathmikaR Contributes Rs 2 Lakhs for Telangana CM Relief fund to fight #CoronavirusPandemic @TelanganaCMO @KTRTRS#LetsFightCoronaTogether #StayHome #StaySafe pic.twitter.com/8X1pHdDPvF
— BARaju (@baraju_SuperHit) April 22, 2020