సినీ ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని చాలా సందర్భాల్లో రుజువైంది. రీసెంట్ గా అది మరోసారి ప్రూవ్ అయింది. మేటర్లోకొస్తే .. యాంగ్రీమేన్ రాజశేఖర్ కి, మెగాస్టార్ చిరంజీవికి గతంలో కొన్ని విబేధాలొచ్చిన సంగతి తెలిసిందే. మొన్నామధ్య మా సమావేశంలో రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్య తీసుకోమని చిరంజీవి సూచించిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు వీటన్నిటికీ భిన్నంగా రాజశేఖర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారనే వార్తలొస్తున్నాయి.

అయితే ఈ విషయం చిరంజీవి దృష్టిలో తప్పకుండా వచ్చే ఉంటుంది. సహజంగా చిరంజీవి విభేదాలు పెరగడానికి ఇష్టపడరు.దాదాపుగా సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి గీతా సంస్థలో రాజశేఖర్‌ నటించడం పెద్ద విశేషం కాదు. మలయాళ సినిమా ‘జోసెఫ్‌’ రీమేక్‌ హక్కులను గీత సంస్థ తీసుకుందట. మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో తీస్తున్న ఈ చిత్రంలో జోజు జార్జ్ పోషించిన  రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను రాజశేఖర్‌ చేత నటింపజేసే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. దీనికి ‘పలాస 1978’ చిత్రంతో వెలుగులోకి వచ్చిన కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తారనే మాట వినిపిస్తోంది. అయితే దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది మాత్రం గీత సంస్థ. అయితే రాజశేఖర్ గీతా ఆర్ట్స్ లో నటించడం ఇది మొదటి సారి కాదు. గతంలో మలయాళ చిత్రం  ‘ఒరు సిబిఐ డైరీ కురిప్పు’ అనే మూవీని రాజశేఖర్ హీరోగా ‘న్యాయం కోసం’ గా రీమేక్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్టయింది. ఇప్పుడు కూడా రాజశేఖర్ తో ఒక మలయాళ రీమేక్ నే తెరకెక్కిస్తుండడం విశేషంగా మారింది.

Leave a comment

error: Content is protected !!