Rajasaab : తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో ప్రభాస్ ఒకడు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో సత్తా చాటుకుంటున్న ఈ బడా హీరో ఇప్పుడు “కల్కి 2898 ఏడీ” సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. “ది రాజా సాబ్” అనే మరో సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హర్రర్ కామెడీ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి అయింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. 2024లోనే విడుదల చేస్తారని కొందరు అంటే, 2025 వరకు వాయిదా వేస్తారని మరికొందరు అంటున్నారు. ఈ అయోమయాన్ని తొలగిస్తూ తాజాగా ఒక సర్‌ప్రైజ్ వచ్చింది. “ది రాజా సాబ్” చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయి. దర్శకుడు మారుతి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. “వరే వరే వరే వచ్చేశాడు రాజా సాబ్” అనే థీమ్ సౌండ్ క్లిప్‌ను కూడా షేర్ చేశాడు. ఈ ఊహించని సర్‌ప్రైజ్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

“ది రాజా సాబ్” హర్రర్ థ్రిల్లర్ కథతో రాబోతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. “ది రాజా సాబ్” చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమవుతోంది.

 

Leave a comment

error: Content is protected !!