స్టైల్ ఐకాన్ ర‌జినీకాంత్, ఇండియ‌న్ దివా ఐశ్వ‌ర్యారాయ్ తో శంక‌ర్ ష‌ణ్ముగం డైరెక్ష‌న్‌లో చేసిన మూవీ రోబో. నిర్మాతకు కాసుల వ‌ర్షం కురిపించిన ఈ మూవీలో ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ఖ్యాతిని పెంచిన బిగ్‌బి అమితాబ్ తో విల‌న్ క్యారెక్ట‌ర్ చేయించాల‌ని ప్లాన్ చేసాడు శంక‌ర్‌. ఎందుకంటే హీరో ర‌జినీకాంత్, విల‌న్ అమితాబ్ ఒకే స్క్రీన్‌పై హోరాహోరీగా యాక్ట్ చేస్తుంటే ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ లా వుంటుంద‌ని శంక‌ర్ ఎంతో ఆశ‌ప‌డ్డారు. అంతేకాదు రోబో మూవీకి అమితాబ్ కూడా యాడ్ అయితే మ‌రింత గ్రాండియ‌ర్ లుక్ వస్తుంద‌నేది శంక‌ర్ ఐడియా. అయితే డైరెక్ట‌ర్ శంక‌ర్ ఆఫ‌ర్‌ని బిగ్‌బి చాలా సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. ఈ మూవీ ఒప్పుకోక‌పోవ‌డానికి బిగ్ బి చెప్పిన మెయిన్ రీజ‌న్ ఏంటంటే.. త‌ను ఆమ‌ధ్య విల‌న్ గా చేసిన ఓ రెండు మూడు చిత్రాలు ఫ్లాప‌య్యాయి. సో ఈ విష‌యాన్ని ఎంతో సెంటిమెంట్‌గా తీసుకున్న బిగ్ బి.. రోబో చిత్రానికి నో చెప్ప‌డం జ‌రిగింది. అలా రోబో లో విల‌న్ ప్రొఫెస‌ర్ బోరా క్యారెక్ట‌ర్ ను బాలీవుడ్ యాక్ట‌ర్ డానీ డిసాంగోను వ‌రించింది.

 

Leave a comment

error: Content is protected !!