భారతీయ సినిమాకు ‘బాహుబలి’ సిరీస్ తో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన దర్శకుడిగా రాజమౌళి పేరును తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. అజేయ దర్శకుడనే కీర్తికి ఎలాంటి భంగం కలగకుండా.. తన తదుపరి చిత్రం ఆర్.ఆర్.ఆర్ పై దృష్టిపెట్టిన ఈ దర్శకుడికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ దర్శకుడికీ సాధ్యమవ్వని రీతిలో ట్విట్టర్ లో రాజమౌళి ఫాలోయింగ్ కొనసాగుతోంది.

ప్రస్తుతం రాజమౌళి ట్విట్టర్ అకౌంట్ 5మిలియన్స్  ఫాలోవర్స్ తో రికార్ట్ సృష్టించింది. ఎప్పటికప్పుడు తన సినిమాలతోనూ, సామాజిక అంశాలతోనూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే రాజమౌళి ఇప్పుడీ రికార్డ్ తో ట్విట్టర్ బాహుబలి గా మారాడు. ఇలా ట్విట్టర్ లో 5మిలియన్స్ మార్క్ ను టచ్ చేసిన అతి తక్కువ భారతీయ దర్శకుల్లో ఒకరు గా రాజమౌళి తన పేరును చిరస్థాయిగా లిఖించుకున్నారు.

 

Leave a comment

error: Content is protected !!