కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో సహాయపడుతున్నారు. అందులో భాగంగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు రాజమౌళికి ఓ ఛాలెంజ్‌ విసిరారు. వంట సామానులు కడుగుతూ – ఇంటిని శుభ్రం చేస్తూ వీడియోను రికార్డు చేసి నిన్న ట్విట్టర్ లో షేర్ చేసి ‘బీ ద రియల్ మెన్’ అని రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు.
అయితే సందీప్ సవాల్ ను స్వీకరించిన రాజమౌళి – ఇంటి పని చేస్తూ ప్లోర్ శుభ్రం చేస్తూ ఉన్న వీడియోని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ – ఎంఎం కీరవాణి – డైరెక్టర్ సుకుమార్ లకు ఛాలెంజ్ విసిరాడు. ఇక రాజమౌళి పోస్ట్ చేసిన వీడియోలో.. రాజమౌళి కిటికీ గ్రిల్స్ శుభ్రం చేస్తూ.. ఫ్లోర్ కడుగుతూ కనిపించాడు. అలాగే వీడియో చివరి షాట్ లో రాజమౌళి తన భార్య రమా వెనుక నిలబడ్డాడు. మరి రాజమౌళి ఛాలెంజ్ కి ఎన్టీఆర్ – చరణ్ నుండి ఏ రేంజ్ వీడియో బయటకు వస్తోందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!