రాజ్‌ దాసిరెడ్డి.. ఈ యంగ్ యాక్టర్‌ క్రమపద్దతిలో కెరీర్‌ను సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. గతంలో భద్రం బీకేర్ బ్రదరుఅనే మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో ఇండస్ట్రీ వర్గాల్లో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రజెంట్‌ ద్విభాషా చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. అప్పటికీ ఇప్పటికీ మధ్యలో చాలా గ్యాప్‌ రావడానికి కారణం ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లో ఆఫర్‌ రావడమే అంటున్నాడు రాజ్‌ దాసిరెడ్డి. ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానంగా సాగనుండటంతో ఎక్కువ టైమ్‌ పడుతుందట. ఈ గ్యాప్‌లో ఓ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానంటున్నాడు. ఊటీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ విభిన్న ప్రేమ కథా చిత్రం కోసం ఊటీలో ఇప్పటివరకు షూటింగ్ చేయని అత్యద్భుత లోకేషన్లు అన్వేషిస్తున్నారు!

Leave a comment

error: Content is protected !!