Raghava Lawrence : కోలీవుడ్ డైనమిక్ స్టార్ రాఘవ లారెన్స్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ చిత్రాల్ని నిర్మించిన కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో లారెన్స్ ఈసారి ‘కాల భైరవ’ అనే సూపర్ హీరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా 25వ చిత్రంగా లారెన్స్ కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలవనుంది. ‘కాల భైరవ’ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
‘ది వరల్డ్ విత్ ఇన్’, ‘ఏ పాన్ ఇండియా సూపర్ హీరో ఫిల్మ్’ వంటి ట్యాగ్‌లైన్లు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌లోకి రానుంది. సూపర్ హీరోగా కొత్త అవతారంలో కనిపించే లారెన్స్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. కఠినత్వం, పవర్ ఉన్న లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్న లారెన్స్ ఈ చిత్రంతో తనలోని మాస్ కోణాన్ని మరోసారి బైటకి తీయబోతున్నాడు. ఈ సినిమా 2025 వేసవిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌కి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలకు తగిన రీతిలో ప్రతి అంశాన్ని బలంగా ప్రతిష్టిస్తున్నారు.