ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టేసుకుంది. విరుగుడు లేని ఈ వైరస్.. మానవాళికి ప్రాణాంతకంగా మారింది. శర వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు గత నెలరోజుల నుంచి లాక్ డౌన్‌ను పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలా కరోనా విజృంభిస్తుంటే.. కట్టడి చేసేందుకు లాక్ డౌన్నూ అంతే పటిష్టంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ను సినీ సెలబ్రిటీస్ రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఇంటిపనులు చేసి ఛాలెంజులు విసురుతుంటే.. మరికొందరు రకరకాల వంటలు చేస్తున్నారు. మరొకరు బొమ్మలు గీసుకుంటున్నారు. మరికొందరు పాటలు పాడుకుంటున్నారు. అయితే ఈ సమయాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం విభిన్నంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కరోనాపై పోరాటం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ 19పై పోరాటం చేయడంలో ముందు నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయని పోలీసులకు, డాక్టర్లకు, రైతులకు, వైద్య సిబ్బంధికి ధన్యవాదాలను తెలిపారు. అంతేకాకుండా ఈ పోరాటంలో మనమంతా విజయం సాధించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని తెలిపారు. ఆ మేరకు ఇంట్లోని దేవుడి విగ్రహాలను, చిత్రపటాలను శుభ్రం చేసి పూజ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
I thank all the frontline warriors working hard by endangering their lives – health workers, police, farmers – and pray that we all win this war against #COVID19 together. 🙏🏻 pic.twitter.com/WZhBKa99dB
— Raghavendra Rao K (@Ragavendraraoba) April 30, 2020