యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అతడి లేటెస్ట్ మూవీకి సంబంధించిన అద్భుతమైన అప్టేడ్ వచ్చేసింది. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ  పీరియాడికల్ రొమాంటిక్ థ్రిల్లర్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఈ రోజే విడుదలైంది. సినిమాకి రాధేశ్యామ్ అనే అట్రాక్టివ్ టైటిల్ ఖాయం చేశారు. హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే హాట్ హగ్ పోస్టర్ తో కూడిన ఈ ఫష్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ‘రాధేశ్యామ్’ లో ప్రభాస్ ఒక పామిస్ట్రీ పండితుడిగా నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పీరియాడికల్ టైమ్ లో సాగే ఈ ఇద్దరి ప్రణయ కథ సినిమాకి హైలైట్ గా మారనుందనే టాక్ వినిపిస్తోంది.  లాక్ డౌన్ లో సైతం కొంత భాగం షూట్ చేసుకున్న ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. గోపీకృష్ణ మూవీస్ అండ్ యూవీ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో పాన్ ఇండియా కేటగిరిలో వివిధ భాషల్లో  తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్’ చిత్రం ప్రభాస్ కు ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!