Raayan trailer : 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న “రాయన్” చిత్రం ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్రం, అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రంలో, సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళీ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ట్రైలర్ మాస్ ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్ తో నిండి ఉంది. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం చిత్రానికి మరింత ఊపునిచ్చింది. ట్రైలర్ లో ధనుష్ ఒక వ్యక్తి కథ చెబుతూ కనిపిస్తాడు. అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏంటో తెలుసా అని అడుగుతాడు. దానికి సింహం అని చైల్డ్ యాక్టర్ గా ఉన్న ధనుష్ సమాధానం ఇస్తాడు. కానీ తోడేలు చాలా జిత్తులమారిది, గుంపుగా కలిసి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తుందని కథను వివరిస్తాడు. ప్రకాష్ రాజ్, ఎస్.జె.సూర్య ప్రతినాయకులుగా కనిపించే డైలాగ్ లు, యాక్షన్ సన్నివేశాలు చిత్రం పై అంచనాలను పెంచుతున్నాయి. హైవోల్టేజ్ యాక్షన్ కథాంశం తో “రాయన్” చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రౌడీయిజం, రాజకీయాలతో ఆధిపత్యం చేసే వారికి ఎదురెళ్ళే పాత్రలో ధనుష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

పీటర్ హెయిన్స్ ఈ చిత్రానికి యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ క్రియేట్ చేసేలా ఉంది. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని, బిజినెస్ కూడా సాలిడ్ గా జరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!