Raayan : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాయన్’. ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 105. 38 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.

ధనుష్ తన అద్భుతమైన నటనతో పాటు, దర్శకుడిగా కూడా తన మార్కు చూపించాడు. ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెహమాన్ అందించిన సంగీతం చిత్రానికి మరో ఆకర్షణ. సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ మూవీని  చాలా భారీ ఎత్తున నిర్మించింది. సినీ ప్రముఖులు, విమర్శకులు ఈ చిత్రాన్ని అభినందిస్తున్నారు. ధనుష్ తన 50వ చిత్రంతో మరోసారి తన ప్రతిభను నిరూపించాడు.

Leave a comment

error: Content is protected !!