Raayan movie : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం “రాయన్”. ఇప్పటికే భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ధనుష్ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, A సర్టిఫికెట్ పొందింది. చిత్రంలో ఎక్కువగా వయోలెన్స్ ఉండటం వల్ల ఈ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.

2 గంటల 25 నిమిషాల నిడివితో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు S.J. సూర్య, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్, సందీప్ కిషన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. “రాయన్” సినిమా యాక్షన్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కింది.

Leave a comment

error: Content is protected !!