చిత్రం: రావే నా చెలియా
నటీనటులు:నెమలి అనిల్, సుబాంగి పంత్, విరాజ్, సీనియర్ నటి కవిత, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు
డిఓపి: విజయ్ ఠాగూర్, 
డైలాగ్స్: మల్లేశ్వర్ బుగ్గ, 
ఎడిటర్: రవి మన్ల, 
మ్యూజిక్: ఎమ్ ఎమ్ కుమార్, 
ఫైట్స్: అవినాష్ మాస్టర్, 
ఆర్ట్: నారాయణ, 
కొరియోగ్రాఫర్: పాల్ మాస్టర్, 
పిఆర్వో: బి. వీరబాబు
నిర్మాత: కీ.శే. నెమలి సురేష్, 
కథ-దర్శకత్వం: మహేశ్వర రెడ్డి.
సూర్య చంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రావే నా చెలియా’. కీర్తి శేషులు నెమలి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి దర్శకుడు. ఏడు నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల థియేటర్స్ మళ్లీ తెరుచుకోవడంతో ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
(అనిల్) గగన్ ఒక సినిమా చెయ్యడానికి వెళుతున్న సమయంలో ఒక అమ్మాయిని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని కథ రాసాడు. ఆ అమ్మాయి పేరు (శుభంగి పంత్) రాజీ, రాజీ మరియు గగన్ పరిచయంలో కొన్ని విషయాలు బయటికి వస్తాయి. ఈ క్రమంలో రాజీ బాయ్ ఫ్రెండ్ (విరాజ్) సాగర్ తో తన ప్రేమ గురించి గగన్ కు వివరిస్తుంది. రాజీ బాయ్ ఫ్రెండ్ సాగర్ కోమాలో ఉంటాడు. తన బాయ్ ఫ్రెండ్ ను బ్రతికించుకోవలనే ఆలోచనలో  ఆలోచనతో గగన్ సినిమాలో రాజీ హీరోయిన్ గా నటిస్తుంది. చివరికి సాగర్ కోమాలో నుండి బయటికి వస్తాడు, రాజీ సాగర్ తో ఉంటుందా ? గగన్ తో వెళుతుందా అనేది వెండితెరపై చూడాలి. 
కథనం:

రావే నా చెలియా సినిమాను హైదరాబాద్, పోచంపల్లి, చిలుకూరు బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ అందరిని అలరిస్తుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నాయి. దాదాపు డైలాగ్స్ అన్ని బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ బాగా గుర్తుండి పోతాయి. పాటలు ఆడియన్స్ అలరిస్తాయి. అనిల్, విరాజ్, సుబాంగి, కవిత పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణ, రచ్చరవి కామెడీ బాగుంది, జబర్దస్త్ రాము బాగా చేశాడు. రఘు కారుమంచి తన పాత్ర పరిధి మేరకు బాగా చేశాడు. లవ్ సీన్స్ యువతకు బాగా ఆకట్టుకునే లా ఉన్నాయి.

డైరెక్టర్ ఎన్. మహేశ్వర రెడ్డి నూతన దర్శకుడు అయినా బాగా చేసాడు, కీర్తి శేషులు నిర్మాత నెమలి సురేష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. హీరో నెమలి అనిల్ మొదటి సినిమానే అయిన బాగా నటించడం జరిగింది. ముఖ్యంగా స్టెప్స్ మరియు డైలాగ్స్ విషయం లో ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. విజయ్ ఠాగూర్ కెమెరా పనితనం బాగుంది. ఎడిటర్ రవి మల్ల బాగా ఎడిట్ చేశాడు. అవినాష్ ఫైట్స్ బాగున్నాయి.

చివరిగా:  చూడదగ్గ రావే నా చెలియా

రేటింగ్: 3/5

Leave a comment

error: Content is protected !!