Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ “పుష్ప: ది రూల్” చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో సీక్వెల్ పై అంచనాలు ఎన్నో రెట్లు పెరిగాయి. నిజానికి మేకర్స్ ఈ చిత్రాన్ని మొదట ఆగస్ట్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందున డిసెంబర్‌ 6 కు వాయిదా వేశారు.

ఇప్పుడు పుష్ప 2 మూవీ ఫైనల్ షెడ్యూల్ లోకి వచ్చింది. లేటెస్ట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ ప్రారంభమైంది. అల్లు అర్జున్, ఇతర ముఖ్య నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు కొనసాగు తుందని తెలుస్తోంది. దీంతో చిత్ర టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందని అంచనా.

దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. పుష్ప మొదటి భాగం చిత్రం డిసెంబర్‌ 17న విడుదలయింది. దాంతో ఈ సినిమా కూడా మొదటి భాగం మాదిరిగానే డిసెంబర్ సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!