పుష్ప మల్లు వెర్షన్‌లో ఊ అంటావా మావా ఊహూ అంటావా అంటూ కేరళ ఆడియెన్స్‌ని ఉర్రూతలూగించిన సింగర్ రమ్య నంబీషన్. కేవలం సింగర్ మాత్రమే కాదు నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది. అప్పుడెప్పుడో సారాయి వీర్రాజులో దర్శనమిచ్చిన రమ్య.. తమిళ, మళయాళ సినిమాలతో బిజీ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు దయా అనే వెబ్‌సిరీస్‌తో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించబోతుంది. దయా వెబ్‌సిరీస్ డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో ఆగస్ట్ 4 నుంచి స్ట్రీమంగ్ కాబోతున్న సందర్భంగా రమ్య నంబీసన్ తెలుగుసినీ పాత్రికేయులతో ముచ్చటించారు.
దయా వెబ్‌సిరీస్ గురించి చెప్తూ.. ఇందులో కవిత అనే జర్నలిస్ట్ పాత్రను చేసాననీ, లేడీ జర్నలిస్ట్‌కు ఎదురయ్యే సవాళ్లు అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు పవన్ సాధినేని అని చెప్పారు. ఈ పాత్ర తనకు చాలా బాగా కనెక్ట్ అయ్యిందన్నారు. తనకు కనెక్ట్ అయ్యే పాత్రలే చేస్తానన్నారు. దయా తనకు చాలా సంతృప్తి ఇచ్చిందన్నారు. వాస్తవానికి ఈ కథ చెప్పినప్పుడు.. తనకు తెలుగు నుంచి ఓ ఆఫర్ వస్తుందని ఊహించలేదన్నారు. నేరేషన్ నచ్చడంతో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్టు చెప్పారు.
ఈ వెబ్ సిరీస్ ఏడు భాషల్లో రిలీజ్ కాబోతుందనీ, ఇప్పుడంతా పాన్ ఇండియా యాక్టర్స్ అవుతన్నారన్నారు. జేడీ చక్రవర్తితో కాంబినేషన్ సీన్స్ ఎక్కువ లేకపోయినా.. జేడీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గొప్పగా ఉందన్నారు. జేడీ పక్కన ఉంటే ఎనర్జీ ఆటోమేటిక్ గా వస్తుందన్నారు. వాస్తవానికి దయా కథ బెంగాలీ థక్దీర్‌కు రీమేక్. కాకపోతే డైరెక్టర్ పవన్ సాదినేని ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసారన్నారు.
ఇతర పాత్రల్లో నటించిన ఈషారెబ్బా, విష్ణు ప్రియలతో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడిందనీ, తనతో పాటు వారికి కూడా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు దక్కాయన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో పవన్ సాదినేనికి మంచి మార్కులు పడతాయన్నారు.
ఇక పుష్పలో ఊ అంటావా పాట అంత పెద్ద హిట్టవుతుందనుకోలేదనీ, పుష్ప 2 లో పాడటం మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ పై ఆధారపడి ఉందన్నారు. ఈ వెబ్‌సిరీస్ ఆడియెన్స్ చలా థ్రిల్ చేస్తుందన్నారు.
దయా వెబ్‌సిరీస్.. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ ముఖ్య పాత్రల్లో నఆగస్ట్ 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను పవన్ సాధినేని తెరకెక్కించారు.