Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ పుష్ప 2. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. జాతర సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలువబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో పుష్పకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ సినిమాను భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా కోసం అప్పుడే కౌంట్‌డౌన్ మొదలైపోయింది. కేవలం 75 రోజుల్లో పుష్ప రాజ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడానికి సిద్ధంగా ఉంది.

Leave a comment

error: Content is protected !!