Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమా డిసెబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ హిట్ పుష్ప ది రైజ్ కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా సరిగ్గా 100 రోజులుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘మరో వంద రోజుల్లో అతడి రూల్‌ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండండి’’ అని టీమ్ పేర్కొంది. ‘వెయిటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పుష్పరాజ్ కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి కొనసాగుతూ, ఈ సినిమాలో పుష్ప రాజ్ అండ్ భన్వర్ సింగ్ షెకావత్ మధ్య జరిగే తీవ్రమైన పోరు, సిండికేట్‌తో పుష్పరాజ్‌ ఆడే గేమ్‌ వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. మొదటి భాగంలో మిగిలిపోయిన ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానం దొరుకుతుందని దర్శకుడు సుకుమార్ తెలిపారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.

పుష్పరాజ్ అండ్ భన్వర్ సింగ్ షెకావత్ మధ్య జరిగే పోరు ప్రేక్షకులను బాగా థ్రిల్ చేయబోతోంది. యాక్షన్ అంశాలతో పాటు సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని దర్శకుడు తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సినిమాకు మరో ఆకర్షణ. మొదటి భాగం సాధించిన విజయం కంటే మరింత విజయం ఈ సినిమా సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!