ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా … క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 ది రూల్”. బాహుబలి, కేజీయఫ్ సీక్వెల్స్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా నుంచి మేకర్స్ ఒక్కొక్క సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.

ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ “పుష్ప పుష్ప” సాలిడ్ హిట్ కాగా ఇప్పుడు రెండో సాంగ్ పై క్లారిటీ ఇచ్చేసారు. రష్మికపై ఓ చిన్న బైట్ వీడియోతో “సూసేకి అంటూ” సాగే ఈ డ్యూయెట్ పాట మే 29న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 15న సినిమా పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!