Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప: ది రైజ్ సినిమా సృష్టించిన సంచలనం ఇప్పటికీ తగ్గలేదు. దీనికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2: ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

ఐఎండీబీ తాజాగా ప్రకటించిన 2024లో అత్యంత ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాలో పుష్ప 2 అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దేవర 1, వెల్ కమ్ టూ ది జంగిల్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. పుష్ప 2 టీమ్ తాజాగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పుష్పరాజ్ అనే పాత్రతో అల్లు అర్జున్ చేసిన అద్భుత నటనకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. పుష్ప 2 కూడా అంతే స్థాయిలో విజయం సాధిస్తుందని అంచనా. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. మొదటి భాగాన్ని మించిన రీతిలో పుష్ప 2 సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి.

Leave a comment

error: Content is protected !!