Pushpa 2 :  అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప: ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా చిన్న విరామం తీసుకున్న బన్నీ తిరిగి సెట్స్‌లోకి చేరాడు. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని జూన్ లోగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రంలోని కీలకమైన మలేషియా షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా ఒక సెట్‌ను నిర్మించారు. అందులోనే ప్రస్తుతం షూట్ జరుగుతోంది.

గత రెండు వారాలుగా సుకుమార్ టీం, బన్నీ, పహాద్ ఫాజిల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడంలో బిజీగా ఉన్నారు. వారి మధ్య సుమారు 15 రోజుల పాటు షూటింగ్ జరగాల్సి ఉంది. ఇంకా పెండింగ్ ఉన్న షూటింగ్ పనులను సుకుమార్ శిష్యులు చూసుకుంటున్నారు. ఒకేసారి రెండు యూనిట్లతో షూటింగ్ జరుగుతోంది.

చిత్రంలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉంది. తొలి భాగం కంటే రెండో భాగంలో ఈ పాట హైలైట్ కావాలని సుకుమార్ భావిస్తున్నారు. ఈ పాటలో నటించడానికి ఎవరిని ఎంచుకోవాలనే దానిపై ఆయన ఇంకా ఖరారు చేయలేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేదా ముంబై ఐటెం డాన్సర్ ఎవరిని ఎంచుకోవాలనే దానిపై ఆయన ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, సుకుమార్ వాటిని ఖరారు చేయలేదు. రష్మిక మందన్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!