Shopping Cart 0 items - $0.00 0

పులిబిడ్డ

 

రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం ‘పులిబిడ్డ’. హేరంజ చిత్ర మందిర్ బ్యానర్ పై యన్.శేషగిరిరావు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూదనరావు దర్శకుడు. 1981లో విడుదలైన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా చరిత్రకెక్కింది. బాక్సింగ్ ఛాంపియన్ అయిన హీరో తండ్రి .. స్వార్ధపరులైన స్నేహితుల నమ్మక ద్రోహానికి బలైపోతాడు. వారిపై అతడి కొడుకు బాక్సర్ అయి .. ఏ విధంగా  ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే మిగతా కథ.  శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో షావుకారు జానకి, అంజలీదేవి, కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, భీమరాజు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో సూపర్ హిట్సే. ముఖ్యంగా కాశీవిశ్వనాథా పాట అత్యంత ప్రజాదరణ పొందింది. ఇక ఈ సినిమా నిజానికి కన్నడ సూపర్ హిట్ చిత్రమైన ‘తాయిగే తక్క మగ చిత్రానికి రీమేక్ వెర్షన్. రాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు వి.సోమశేఖర్ దర్శకత్వం వహించారు. అలాగే..  ఇదే సినిమాను బాలీవుడ్ లో ధర్మేంద్ర హీరోగా ‘మై ఇంతకామ్ లూంగా’  గా రీమేక్ చేయగా.. అక్కడ కూడా ఘన విజయం సాధించింది.

Leave a comment

error: Content is protected !!