PujaHegde :  స్టార్ హీరో సూర్య, డైనమిక్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా రీసెంట్ గా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే హిందీలో ఆమె నటించిన ‘దేవా’ అనే యాక్షన్ మూవీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.

మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన దేవా చిత్రంలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించగా, పూజా హెగ్డే అతడికి జోడీగా నటించింది. తాజాగా చిత్ర నిర్మాతలు షూట్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన ర్యాప్-అప్ కేక్ కటింగ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాప్ యాక్షన్ థ్రిల్లర్ ‘దేవా’ అక్టోబర్ 11, 2024న థియేటర్లలోకి రానుంది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో పావైల్ గులాటి మరియు కుబ్రా సైత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా పూజా హెగ్డే కు ఏ స్థాయిలో అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!