Priyanka chopra : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక యాక్షన్ పాత్ర కోసం శారీరకంగా ఎంతో శ్రమిస్తోంది. ‘ది బ్లఫ్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఆమె నటిస్తోంది. ఫ్రాంక్ ఇ.ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవల, ప్రియాంక ఈ చిత్రంలోని కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంది. ఈ సన్నివేశాల్లో నటిస్తూ ఆమెకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ, గాయాలతో కూడిన ఫోటోలను, వీడియోను ప్రియాంక పంచుకుంది.
“యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా గ్లామర్ కనిపిస్తాం” అని ఈ సందర్భంగా ప్రియాంక చెప్పుకొచ్చింది. ఒక మహిళ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాట నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏజీబీఓ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. యాక్షన్ హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ప్రతిభను చూపించడానికి ఈ చిత్రం ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ప్రియాంక చోప్రా యాక్షన్ హీరోయిన్‌గా అవతారం ఎత్తిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.