నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో గతంలో టాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రాలు అత్యధిక శాతం విజయం సాధించాయి. ఈ తరం ప్రేక్షకుల్ని కూడా ఆ బ్యాక్ డ్రాప్ తో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు యువ దర్శకుడు వేణు ఊడుగుల. సినిమా పేరు ‘విరాటపర్వం’. దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధానపాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి. అయితే లాక్ డౌన్ కారణంగా విడుదలను వాయిదా వేసుకుంది. అతి త్వరలోనే ‘విరాట పర్వం’ చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ . పనిలో పనిగా సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని కూడా మొదలు పెట్టారు. నేడు ప్రియమణి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆమె ‘కామ్రేడ్ భారతక్క’ లుక్ ను విడుదల చేశారు.
ఇందులో ప్రియమణి నక్సలైట్ దుస్తుల్లో తుపాకీ పట్టుకొని రివీల్ అయింది. ఈ లుక్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మొన్నటికి మొన్న సాయిపల్లవి పుట్టిన రోజునాడు ఆమె లుక్ ను విడుదల చేసిన మేకర్స్ .. ఈ రోజు ప్రియమణి లుక్ ను విడుదల చేసి .. నెటిజెన్స్ ను ఆకట్టుకున్నారు. కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి పాత్ర ..అందరి హృదయాల్ని టచ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే కథాంశంతో తో తెరకెక్కుతోన్న విరాటపర్వం చిత్రం ప్రియమణికి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.