కంటెంట్‌ బాగుంటే ఏ భాషా చిత్రాన్నైనా తెలుగు ఆడియెన్స్‌ ఆదరిస్తారనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి చిత్రంగా రాబోతుంది ప్రియమైన ప్రియ. ఇది ఒరిజినల్ వెర్షన్‌ తమిళ్.  ప్రియముడన్‌ ప్రియ గా తమిళ్‌లో , ప్రియమైన ప్రియగా తెలుగులో రాబోతుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కుమారుడు శ్రీకాంత్‌ దేవా సంగీతాన్నందించారు. ఇది శ్రీకాంత్‌ దేవాకు 100 వ చిత్రం.
సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి U/A సెన్సార్‌ సర్టిఫికెట్ జారీ అయ్యింది. కంటెంట్ పరంగా.. టెక్నికల్ క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు A.J సుజీత్‌, A బాబు లు నిర్మించారు. ఈ చిత్రానికి A.J సుజీత్‌ దర్శకత్వం కూడా వహించారు. అశోక్‌ కుమార్‌, లీషా ఎక్లెయిర్స్‌ హీరోహీరోయిన్లు.
ప్రియమైన ప్రియ లో లవ్‌ , సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో యూనిక్ సబ్జెక్ట్‌తో రూపొందిన చిత్రమనీ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్‌. గోల్డెన్‌ గ్లోరీ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్‌ మ్యాక్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా  ఆగస్ట్ 4 న రిలీజ్‌ కాబోతుంది.

Leave a comment

error: Content is protected !!