ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియో గ్రాఫర్ ప్రభుదేవా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా “ప్రేమికుడు” నేడు మే 1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉండగా, టెక్నికల్ సమస్యల కారణంగా వాయిదా పడింది. వరల్డ్ వైడ్ తెలుగు డిస్ట్రిబ్యూటర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రేమికుడు” సినిమా రీ రిలీజ్‌కు మీడియా నుండి అందిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ఈ రోజున రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు.
“ప్రేమికుడు” సినిమా జూన్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మురళీధర్ రెడ్డి వెల్లడించారు. అయితే కొన్నిచోట్ల “ప్రేమికుడు” సినిమా ఇవాళ విడుదలైందని తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని మురళీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇస్తూ, సరైన సమాచారం ప్రచురించాలని మీడియాను కోరారు. “సినిమాపై మాకు చాలా పాషన్ ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా రిలీజ్ డేట్‌తో మరోసారి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి, జూన్ నెలలో ‘ప్రేమికుడు’ సినిమాను విడుదల చేయబోతున్నాము,” అని మురళీధర్ రెడ్డి తెలిపారు.

Leave a comment

error: Content is protected !!