Prashanth Neel : దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో కేజీఎఫ్ సిరీస్ తో అద్భుత విజయం సాధించి, ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ వస్తున్న ఈ దర్శకుడు, తన భవిష్యత్తును ఇప్పటికే ఐదేళ్లకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఒక అగ్ర హీరో డేట్స్ దొరకాలంటే ఏడాది లేదా రెండేళ్లు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ముందే కథలు లాక్ చేసుకుని, ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సలార్  ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్  సలార్ 2 ను ప్రారంభిస్తారు. ఈ సినిమా 2027లో సమ్మర్ కు విడుదల కావచ్చని టాక్. కేజీఎఫ్ సిరీస్ కు మంచి ఆదరణ లభించడంతో, కేజీఎఫ్ 3 స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. ఈ సినిమాకు ఒకేడాదిన్నర టైం పట్టే అవకాశం ఉంది.

లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్, రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానయ్య నిర్మాణంలో రానున్న ఈ ప్రాజెక్టు 2029 లేదా 2030 లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 2021లోనే రామ్ చరణ్ కు ఒక కథ వినిపించినప్పటికీ, పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఫైనల్ గా ఇప్పుడు మరో కథకు కనెక్ట్ అయినట్లు సమాచారం.

ప్రశాంత్ నీల్ తన భవిష్యత్తును ఐదేళ్లకు ప్లాన్ చేసుకుని, అగ్ర హీరోలందరితో కలిసి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ లైనప్ అనుకున్నట్లుగా సాగుతుందో లేదో చూడాలి. అయితే, ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు కాబట్టి, ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతం అవుతాయని ఆశిద్దాం.

Leave a comment

error: Content is protected !!