Prabhudeva : తన నటనతోనే కాదు, డ్యాన్స్‌తోనూ ప్రేక్షకులను అలరించే ప్రభుదేవా తన తాజా చిత్రంతో మరోసారి మాయాజాలం చేయబోతున్నారు. ‘మూన్‌ వాక్‌’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా నటనతో పాటు డ్యాన్స్ కు సమాన ప్రధాన్యం ఇవ్వబోతున్నారు. మనోజ్‌ ఎన్‌ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యా మనోజ్, ప్రవీణ్‌ ఏలక్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితమే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్‌ను తాజాగా ప్రకటించింది చిత్రబృందం. డ్యాన్స్‌ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ చిత్రం రూపొందుతోంది. ప్రభుదేవా హీరోగా నటించిన ఎన్నో పాటలకు విజయవంతమైన సంగీతాన్ని అందించిన ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో రానున్న ఆరవ చిత్రమిది. యోగిబాబు, అర్జున్‌ అశోకన్, దీపా శంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!