Prabhudeva : కోలీవుడ్ హీరో కమ్, నృత్య దర్శకుడు ప్రభుదేవా ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జేఎమ్ రాజా దర్శకత్వం వహించే “సింగనల్లూర్ సిగ్నల్” అనే చిత్రంలో ప్రభుదేవా ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం అధికారికంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి ఉన్న ప్రభుదేవా లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జోడిగా ‘జో’ ఫేమ్ భవ్య త్రిఖ నటిస్తుంది. ఏజే ప్రభాకరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.  వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభుదేవా ఈ కొత్త సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్రలో ఆయన నటన ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!